Coronavirus Control in Komaram Bheem District: కరోనా కట్టడిలో కుమ్రంభీం జిల్లా ప్రత్యేకత

Update: 2020-08-01 08:09 GMT
కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

కాటేసే కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది రాకాసి రోగం దండయాత్రతో ప్రజలకు దడపుడుతోంది అలాంటి గత్తరాలాంటి రోగాన్ని గడప చేరకుండా పటిష్ట వ్యూహాన్ని అమలు ‌చేస్తున్నారు అక్కడి అధికారులు. ఆ వ్యూహంతోనే మహమ్మారిని విజృంభించకుండా పాతరేశారు. ఇంతకీ ఆ ప్రాంతమేది..? కరోనా కట్టడిలో అందరికి స్పూర్తినిస్తున్న ఆ ప్రాంతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? లెట్స్ వాచ్

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కాని ఆదివాసి జిల్లా కుమ్రంభీంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా కట్టడి చేయడంలో అక్కడి అధికారులు సక్సెస్ అయ్యారు. కుమ్రంభీం జిల్లాలో ఇప్పటి వరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ప్రస్తుతం 17 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాను కట్టడి చేయగలిగిన వంద జిల్లాల్లో కుమ్రంభీమ్ జిల్లా ఎనిమిదవ స్థానంలో నిలిచింది‌. ఇక్కడి అధికారులు కరోనా‌ కట్టడి చేస్తున్న తీరును నీతిఆయోగ్ ప్రశంసించింది.

ప్రాథమిక దశలోనే వ్యాధిని నియంత్రణ చేసేందుకు అధికారులు తీసుకున్న చర్యలు సత‌్ఫలితాలనిచ్చాయి. లాక్‌డౌన్ ఎత్తివేతతో రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగతున్న నేపథ్యంలో కుమ్రంభీం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ముప్పై శాతం అదివాసీల జనాభా ఉండగా ఈ ప్రాంతంలో కరోనా కట్టడికి పటిష్ట ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలోకి కొత్తగా ఎవరొచ్చినా థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే జిల్లాలో ప్రవేశించడానికి అనుమతి ఇస్తున్నారు అధికారులు. ఎవరికైనా కరోనా సోకితే వారు పూర్తిగా కోలుకునే వరకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్ ఉన్నా వారికి కూడా ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారెవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అధికారులకు తోడు గిరిజనులు కూడా ఈ మహమ్మారిని తరమడంలో అందరికి స్పూర్తినిస్తున్నారు. గూడాలలో స్వచ్చందంగా లాక్ డౌన్ అమలు చేస్తూ వ్యాధిని తమ దరికి చేరకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు గూడెం వాసులు. కరోనా కట్టడిలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి గూడాల వరకు ఉదయం పదిగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వాణిజ్య సముదాయాలు మూసివేసి లాక్ డౌన్ పాటిస్తున్నారు. దాంతో సామూహికంగా ప్రజలు తిరగడం లేదు. కరోనా నియంత్రణ చేయడం తమ బాద్యత అంటున్నారు.

గూడాలలో పెద్ద పటేల్ ఒక నిర్ణయం తీసుకుంటే అది పార్లమెంటు చట్టంలా అమలు చేస్తారు. ఆ విధంగా కరోనాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కనీసం నిత్యవసర వస్తువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు. స్వయంగా వస్తు మార్పిడి చేసుకుంటు అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇలా కరోనా కట్టడిలో సక్సెస్ సాధించిన ఆదివాసీలు గిరిజనుల్లో చైతన్యం, అవగాహన ఉండదనేది అపోహ అని నిరూపిస్తున్నారు.

Full View



Tags:    

Similar News