Corona Symptoms: కొత్త కేసుల్లో కనిపించని వైరస్‌ లక్షణాలు

Corona Symptoms: కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం మంది వైరస్ లక్షణాలు వుండటం లేదు.

Update: 2021-03-20 04:45 GMT

Corona జీఎంపీతోమ్స్:(ఫైల్ ఇమేజ్)

Corona Symptoms: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. అయితే.. కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో వైరస్‌ లక్షణాలు లేని బాధితులు దాదాపు 90 శాతం ఉంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ తరహా కొవిడ్‌ బాధితులు సుమారు 70 శాతం మంది ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఏకంగా 90 శాతానికి పెరిగిందని.. ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ తరహా బాధితుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలేవీ రావని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

12-18 ఏళ్లలోపు విద్యార్థులే అధికం...

ఎటువంటి లక్షణాల్లేకపోవడం వల్ల బాధితులెవరూ కొవిడ్‌ జాగ్రత్తలేవీ పాటించడం లేదని, వారి ద్వారా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతరులకు వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది వైద్యారోగ్యశాఖ. ఇటీవల కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 40 శాతం మంది 12 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులేనని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం కావడం.. పని ప్రదేశాల్లో కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

సాధారణ లక్షణాలు...

కరోనా స్టార్టింగ్‌లో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, నీరసం తదితర తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందేవారు. తాజా కేసుల్లో ఈ లక్షణాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జలుబు, కొద్దిగా పొడి దగ్గు, జ్వరం లేకపోవడం, ఒకవేళ వచ్చినా 99-100 డిగ్రీల లోపే నమోదవడం, రుచి, వాసన గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువమందిలో ఉన్నాయని తెలిపారు. లక్షణాలు లేకపోవడంతో చాలా మంది.. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదని, ఫలితంగా వైరస్‌ వ్యాప్తి క్రమేణా పెరగడానికి వారు కారణమవుతున్నారని వైద్యాధికారులు అంటున్నారు.

తెలంగాణ లో చాపకింద నీరులా..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా మార్చి నెల నుంచి కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే.. విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదు కావడం.. తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లల్లో కేసులు రికార్డు కాగా.. తాజాగా.. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది.

ఏపీలో 246మందికి పాజిటివ్‌...

ఏపీలో గత 24గంటల్లో 246మంది కరోనా బారినపడ్డారు. గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు 31,546 నమూనాలనుపరీక్షించారు. కొవిడ్‌తో ప్రకాశంలో ఒకరు మరణించారు. అత్యధికంగా గుంటూరు 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News