Coronavirus: తెలంగాణలో స్కూల్స్‌, థియేటర్ల బంద్..?

Coronavirus: కరోనా హాట్‌స్పాట్స్‌గా పాఠశాలలు, గురుకులాలు * తెలంగాణలో మళ్లీ కరోనా అలజడి

Update: 2021-03-19 03:17 GMT

ఫైల్ ఫోటో 

Coronavirus: అయిపోయిందిలే అని ఊపిరిపీల్చుకుంటున్న వేళ తెలంగాణలో మళ్లీ కరోనా అలజడి. అవును రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో జడలు విప్పుతోంది. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాలు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారాయి. దీంతో స్కూల్స్‌ మూసివేత దిశగా కీలక నిర్ణయం తీసుకోబోతున్న సర్కార్‌ సినిమా హాళ్లను కూడ మూసివేయలా..? వద్దా? అనే ఆలోచనలో పడింది.

వందశాతం ఆక్యుపెన్సీతో సినిమాల రిలీజ్‌కు పర్మిషన్‌ ఇచ్చి ఎన్నో రోజులు కూడా అవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్‌ వేవ్‌తో కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వరుసగా రిలీజ్‌లు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్‌కి మళ్ళీ కరోనా దెబ్బపడేలా ఉంది. మొత్తానికి క్రాక్‌, ఉప్పెన, జాతిరత్నాలు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌తో ఉన్న టాలీవుడ్‌కి కరోనా కష్టాలు తప్పేలాలేవు.

ఏప్రిల్‌ 9న వకీల్‌ సాబ్‌, ఏప్రిల్‌ 16న లవ్‌స్టోరీ మే 13న ఆచార్య, మే 14న నారప్ప జూలై 16 కేజీఎఫ్‌-2, జూలై 16న రాధేశ్యామ్‌ ఇలా పెద్దపెద్ద సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఒక వేళ మళ్లీ థియేటర్లు మూసేస్తే నిర్మాతలు ఓటీటీ బాట పడతారో లేక మళ్లీ థియేటర్లు స్టార్ట్ అయ్యేవరకు రిలీజ్‌ చేయకుండా ఆగుతారో చూడాలి మరీ. ఏదీఏమైనా కరోనా సెకండ్‌ వేవ్‌ గుబులు టాలీవుడ్‌ని వేధిస్తుంది.

Tags:    

Similar News