Corona Rapid Test in GHMC: GHMCలో రాపిడ్ టెస్టులు.. అరగంటలోనే ఫలితం!
Corona Rapid Test in GHMC: తెలంగాణలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే! రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి
Corona Rapid Test in GHMC: తెలంగాణ లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే! రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. ఇక తెలగాణాలో ఒక్క జిహెచ్ఎంసి పరిధి లోని అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.. దీనితో నగరవాసులు గజగజ వణుకుతున్నారు.. ఇందులో ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది..ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడ్ టెస్టులను చేయాలని నిర్ణయించింది. దీని కోసం కొన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 50, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వీటిని నిర్వహిస్తున్నారు.
అయితే ఈ పరీక్షల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవడమేనని అధికారులు అంటున్నారు.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఇక ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, నెగటివ్ వస్తే మాత్రం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది .
ఇక తెలంగాణలో కరోనా కేసులు విషయానికి వచ్చేసరికి బుధవారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు. ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 1590 కేసులొచ్చాయి.దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29 వేల 536 కి చేరింది. ఇందులో 17 వేల 279 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 11 వేల 933 యాక్టీవ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 324 మంది కరోనా తో చనిపోయారు.