Corona: డబ్బులు చెల్లించలేదని కరోనా పేషెంట్‌ను బంధించిన హాస్పిటల్ యాజమాన్యం..!

Corona: అల్వాల్‌కు చెందిన రామారావును * బయటకు వెళ్లకుండా బంధించిన ఆస్పత్రి యాజమాన్యం

Update: 2021-04-20 10:57 GMT

బేగంపెట్ లోని విన్ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Corona: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు మరోసారి డబ్బులు దండుకోవడంలో బిజీగా మారాయి. లేనిపోని టెస్ట్‌లు చేస్తూ.. రోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని విన్‌ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. అల్వాల్‌కు చెందిన రామారావు అనే వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లకుండా బంధించింది ఆస్పత్రి యాజమాన్యం.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండటంతో చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తామే క్లైమ్‌ చేసుకుంటామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే అనవసర టెస్ట్‌లు చేసి.. నాలుగు లక్షల బిల్లు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రామారావు. పరీక్షలు చేయకుండానే చేసినట్లు రిపోర్ట్‌లో ఉండటంతో ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లైమ్‌ చేయకుండా ఆపేసింది. దీంతో నాలుగు లక్షలు కట్టే వరకు డిశ్చార్జ్‌ చేసేది లేదని హాస్పిటల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. 20 రోజుల నుంచి డిశ్చార్జ్‌ చేయకుండా బంధించారు. రామారావుకు గుండె జబ్బు ఉందని బెడ్‌ ఇవ్వాలని ప్రాధేయపడినా కనికరించలేదని... దీంతో రామారావు కుటుంబ సభ్యులు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News