Coronavirus in Mancherial RTC Depot: ఆర్టీసీలో కరోనా కలకలం
Coronavirus in Mancherial RTC Depot: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలకలం రేపింది. డిపో గ్యారేజీలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారన కావడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Coronavirus in Mancherial RTC Depot: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలకలం రేపింది. డిపో గ్యారేజీలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారన కావడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతే కాక డిపోలో విధులకు హాజరు కావడానికి తర్జనభర్జన పడ్డారు. డిపోలో విధులకు ఉదయం 9గంటలకు హాజరుకావాల్సి ఉన్నప్పట్టికి ఆర్టీసీ సిబ్బంధి మధ్యాహ్నం వరకు కూడా విధుల్లోకి చేరలేదు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ మల్లేశయ్య అక్కడి చేరుకున్నారు. అనంతరం సిబ్బంధితో మాట్లాడగా వారందరూ హోంక్వారంటైన్‌లో ఉండేందుకు పదిహేను రోజులపాటు మూకుమ్మడి సెలవులు ఇవ్వాలంటూ సెలవు పత్రాలు అందజేశారు. ఈ విషయాన్ని డీఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగులందరికి ఒకేసారి సెలవులు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఉద్యోగులతో చర్చల అనంతరం 10 మందికి సెలవులకు అనుమతించగా మిగిలిన ఉద్యోగులు సెలవు పత్రాలు వెనక్కి తీసుకొని విధులకు హాజరయ్యారు అగ్ని మాపకశాఖ ఆధ్వర్యంలో డిపో ఆవరణలో హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేశారు. ఉద్యోగుల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే వారికి సెలవులు మంజూరు చేసేందుకు సమ్మతించారు. అనంతరం ఆర్టీసీ వైద్యుడు జోగిందర్ కరోనాపై ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎం మల్లేశయ్యతో విజిలెన్స్, సెక్యూరిటీ హెడ్‌కానిస్టేబుల్ సురేందర్‌రావు, ఎంఎఫ్ మధుసూధన్, అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత పాల్గొన్నారు.
ఇక పోతే తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,612కు చేరగా.. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 7 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 313కు చేరింది. మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 14222 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్ జిల్లాలో 32 వరంగల్ అర్బన్ 13 , మహబూబ్ నగర్ లో 11, కామారెడ్డిలో 7, గద్వాల్ లో 4, నల్గొండ లో 31, జిల్లాలో 10 నిజామాబాద్ జిల్లాలో 19, మెదక్ లో 12, మహబూబాబాద్ లో 2, భుపాలపల్లి లో 6, కొత్తగూడెం 3, ములుగు 12, ఆదిలాబాద్ , జనగాం, వనపర్తి, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
కొత్తగా 1506 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 16,287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,012 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. శనివారం కొత్తగా 6,220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,438మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం కూడా కంటైన్మేంట్ జోన్లలో లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పొడిగించింది.