Corona Cases in Telangana: తెలంగాణలో 19,445 మంది పదేళ్లలోపు పిల్లకు కరోనా

Corona Cases in Telangana: వయసుల వారీగా నివేదికను రూపొందించిన వైద్య, ఆరోగ్యశాఖ...

Update: 2021-10-28 03:34 GMT

Corona Cases in Telangana: తెలంగాణలో 19,445 మంది పదేళ్లలోపు పిల్లకు కరోనా

Corona Cases in Telangana: రాష్ట్రంలో ఇప్పటివరకు యువకులు, పదేళ్లలోపు పిల్లలపై కరోనా పంజా విసిరింది. తాజాగా వయసుల వారీగా కరోనా బాధితుల నివేదికను వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించింది. 20ఏళ్ల లోపు యువకులు 90వేల 561 మందికి కరోనా సోకగా, పదేళ్లలోపు వయసున్న 19వేల 445 మంది పిల్లలకు కొవిడ్ సోకింది.

మొత్తం నమోదైన కేసుల్లో 61.4 శాతం మంది పురుషులు కాగా.. 38.6 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇక 31 నుంచి 40 ఏళ్ల బాధితులు 21.8 శాతం మంది ఉండగా అందుటో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉన్నారు.

ఇక 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 17.5శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 51 నుంచి 60 ఏళ్ల వారు 14.4 శాతం, 61 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారు 7.7 శాతం, 71 నుంచి 80 ఏళ్ల వారు 2.7 శాతం, 81 ఏళ్లు.. ఆ పై వయసు ఉన్న వారు 0.7 శాతం మంది మహమ్మారి బారినపడినట్లు తెలంగాణ వైద్య శాఖ‌ రిపోర్ట్‌లో వెల్లడించింది.

కొవిడ్‌తో మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఒక్కోసారి కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో కొత్తగా 186 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 70వేల 829కి పెరిగింది. మహమ్మారితో ఒకరు కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4వేల 164 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News