TS Congress: గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్

TS Congress: 14 స్థానాల గెలుపుపై ప్రత్యేక దృష్టి

Update: 2024-04-03 09:50 GMT

TS Congress: గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ 

TS Congress: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ఓటు ని కాపాడుకోవడం పై దృష్టి పెట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉందని ఆపార్టీ నాయకులంటున్నారు.

ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఏ విధంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో అదేవిధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేంద్రంలో అధికారం దిశగా కాంగ్రెస్ ఉండేలా ప్రజలు దీవించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

17 పార్లమెంటు నియోజకవర్గలల్లో గెలుపొందే వారికి టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు. మొత్తం 14 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని భావిస్తున్నారు. మెజార్టీ దిశగా అడుగులు వేయాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను వివిధ కార్యక్రమాలను ఎత్తిచూపి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్. ఇదే సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే అన్నిటినీ అమలు చేశామని చెప్తున్నారు. మిగతా గ్యారెంటీలను కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీర్ఎస్ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని రైతన్నకి నీళ్లు ఇవ్వడంలో విఫలమైందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలంటున్నారు. 17 పార్లమెంటు నియోజకవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జులను నియమించింది.

మొదటగా ఇన్‌ఛార్జుల సమావేశాల తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.. మొదటి బహిరంగ సభ తుక్కుగూడ వేదికగా నిర్వహించిన తర్వాత వరుసగా నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించే విధంగా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అనేది ఎన్నికలనాటికి వేచి చూడాలి.

Tags:    

Similar News