కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం-ఉత్తమ్ కుమార్ రెడ్డి

*వ్యవసాయ చట్టాలు నిర్ణయం తీసుకునే ముందు రైతులతో చర్చలు జరపలేదు-ఉత్తమ్ *రైతుల పంటల మద్దత ధరకు చట్టబద్దత కల్పించాలి

Update: 2021-02-03 12:07 GMT

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైల్ ఫోటో 

కేంద్రం వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చే ముందు ఎక్కడా రైతులతో చర్చలు జరపలేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల అధికారాలను అధిగమించి కేంద్రం వ్యవసాయ చట్టాలు తీసుకురావడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమన్నారు. రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరారు. వ్యవసాయ చట్టాల గురించి ప్రశ్నిస్తే కేంద్రం దుష్ప్రచారం చేస్తుందని ఉత్తమ్ ఆరోపించారు. ఇక తెలంగాణలోనూ రబీ పంటలు పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ వ్యవహారం గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీలా ఉందని విమర్శించారు.


Tags:    

Similar News