Congress MP Revanth Reddy Arrest: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి అరెస్ట్..
Congress MP Revanth Reddy Arrest: శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్ట్ చేసారు.
Congress MP Revanth Reddy Arrest: శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్ట్ చేసారు. అగ్ని ప్రమాదంపై సీఐడి దర్యాప్తు జరగుతున్న నేపధ్యంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకు రేవంత్ రెడ్డి కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉప్పునూతల మండలం లత్తీపూర్ పెట్రోల్ బంక్ వద్ద రేవంత్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. లత్తీపూర్ నుండ రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి ఉప్పునూతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే, ఈ సంధర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రతిపక్ష నేతలకు వాస్తవాలను తెలుసుకొనే హక్కు కుడా లేదా? ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కు ఏంటి'. అని ప్రశ్నించారు. అంతే కాదు జరిగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్ట్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రజా ప్రతినిదులుగా సంఘటన స్థలాన్ని పరిశీలించి.. భాదిత కుటుంబాలని పరామర్శించడం మా బాధ్యత అని.. తెలంగాణ ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు సరైనది కాదు అన్నారు.. వెంటనే రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవిని విడుదల చెయ్యాలని ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు.