మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగా ఉంది.. సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ..

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు.

Update: 2023-07-21 11:19 GMT

మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగా ఉంది.. సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ..

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ఎల్బీనగర్‌ నుండి హయత్‌నగర్‌ వరకు మెట్రోను పొడగించాలని కోరారు. ఎంతో మంది ప్రజలు హయత్‌నగర్‌ నుండి ఎల్బీనగర్‌కు వెళ్లి అక్కడి నుండి మెట్రోకు వెళ్తున్నారని తెలిపారు. ఈ లైన్‌ పొడిగించే యోచన ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపాదనలు పంపడానికి ముందుకు రావడం లేదని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగి...ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని...మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్‌ ఉందని తెలిపారు. మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందని..ప్రజా ప్రయోజనాల దృష్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News