కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరుతో ఆడియో వైరల్.. తమ్ముడు రాజగోపాల్‌ను గెలిపించండంటూ..

Komatireddy Venkat Reddy: టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియోగా.. ఒక ఫోన్‌ కాల్‌ టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Update: 2022-10-21 09:49 GMT

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరుతో ఆడియో వైరల్.. తమ్ముడు రాజగోపాల్‌ను గెలిపించండంటూ..

Komatireddy Venkat Reddy: టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియోగా.. ఒక ఫోన్‌ కాల్‌ టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఓ కాంగ్రెస్‌ లీడర్‌తో వెంకట్‌రెడ్డి మాట్లాడినట్టుగా ఓ ఆడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వారికి హామీ ఇవ్వడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ అవుతానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని.. ఇప్పుడు పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ కు ఓటు వేయాలి.. సావులు, బతుకులు, పెళ్లిళ్లు, పిల్లలు ఇలా ప్రతీదానికి రాజగోపాల్‌రెడ్డి సాయం చేస్తూ ఉంటారని ఆ ఆడియోలో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Tags:    

Similar News