Jeevan Reddy: ప్రభుత్వమే ప్రయివేటు విద్యకు తెరలేపుతోంది..

Jeevan Reddy: సామాజిక తెలంగాణకు విరుద్దంగా ప్రభుత్వమే ప్రయివేటు విద్యకు తెరలేపుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.

Update: 2022-09-14 14:45 GMT

Jeevan Reddy: ప్రభుత్వమే ప్రయివేటు విద్యకు తెరలేపుతోంది..

Jeevan Reddy: సామాజిక తెలంగాణకు విరుద్దంగా ప్రభుత్వమే ప్రయివేటు విద్యకు తెరలేపుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో 5 ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విశ్వ విద్యాలయాలు నిర్వీర్యం అవుతాయన్నారు. ప్రైవేటు యూనివర్శిటీల్లో స్థానికులకే కేవలం 25శాతమే మాత్రమే సీట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కేజీ – పీజీ ఉచిత విద్య అందరికి సమకూరుతుందన్న ప్రభుత్వం ఆ విధంగా నడుచుకోవడం లేదన్నారు. మన ఊరు మన బడి నామ మాత్ర ప్రకటనలకే పరిమితం అయింది..ఆంగ్ల మాధ్యమం, ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు.

Tags:    

Similar News