రేవంత్ రెడ్డి జోడో యాత్రలో గందరగోళం.. టీపీసీసీ చీఫ్‌ ముందే తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు

Kamareddy: ఆపేందుకు ప్రయత్నించిన రేవంత్ ప్రైవేట్ సెక్యూరిటీపై దాడి

Update: 2023-03-19 10:18 GMT

రేవంత్ రెడ్డి జోడో యాత్రలో గందరగోళం.. టీపీసీసీ చీఫ్‌ ముందే తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు

Kamareddy: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గాంధారి మండల కేంద్రంలో పేపర్‌ లీకేజీపై రేవంత్‌ ఒకరోజు దీక్ష చేపట్టారు. అయితే.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలోనే మదన్‌మోహన్, సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆపేందుకు ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీపైనా దాడి చేశారు. సుభాష్‌రెడ్డి వర్గానికి రేవంత్‌రెడ్డి కొమ్ముకాస్తున్నారంటూ.. మదన్‌మోహన్‌రెడ్డి వర్గం బహిరంగంగానే ఆరోపణలు చేసింది. దీక్షాస్థలిపై మదన్‌ను మాత్రమే అనుమతించాలని సెక్యూరిటీ సూచించడం.. ఈ వివాదానికి దారి తీసింది.

Tags:    

Similar News