Patnam Mahender Reddy: నాకు నోటీసులు రాగానే కూల్చేస్తా..
111 జీవో ప్రకారం చాలా మంది పెద్దవాళ్లు ఇళ్లు కట్టారని.. తాను కట్టానని చెప్పారు. తాను రూల్స్ ప్రకారం నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్‌కు తెలియకపోవచ్చని..తనకు నోటీసులు రాగానే తన ఇళ్లు కూల్చేస్తాని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Patnam Mahender Reddy: గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్‌గూడలో 1999లో తాను భూమి కొన్నానని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 14 ఎకరాల14 గుంటల భూమి తన కొడుకు పేరు మీద ఉందన్నారు. పట్టా భూమి తీసుకుని మామిడి తోట,వరి సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హంగులు,ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే తానే తన ఇంటిని కూల్చేస్తాని... ప్రభుత్వం వచ్చి కూల్చాల్సిన అవసరం లేదని అన్నారు.