Bhatti Vikaramarka Comments on CM KCR: కేసీఆర్‌కు సేవ చేయడం ఒక్కటే జగదీశ్ రెడ్డికి తెలిసిన విద్య

Bhatti Vikaramarka Comments on CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

Update: 2020-07-06 11:30 GMT
Bhatti Vikaramarka (File Photo)

Bhatti Vikaramarka Comments on CM KCRCoronavirus: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ కనిపించకుండా పోయారని ఎద్దేవాచేసారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ మనిషి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు సేవ చేయడం ఒక్కడే జగదీశ్ రెడ్డికి తెలిసిన విద్య అని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు విపరీతంగా వచ్చాయని.. విద్యుత్ బిల్లులను తగ్గించాలని వివరణ అడుగుదామన్నా సీఎం అందుబాటులో లేకుండా పోయారని మండిపడ్డారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం స్పందిచకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని భట్టి తేల్చి చెప్పారు. అధికారుల ద్వారా అ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని చెప్పారు.

ఇక పోతే ఇటీవలి కాలంలో భట్టి, ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు ఓ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ నేత ఉత్తమ్‌తో పాటు, భట్టి విక్రమార్కలు కొండపోచమ్మ సాగర్‌ జలాశయం ఎడమ కాలువకు గండి పడిన విషయంలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సమయంలో ఓ ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శనాస్త్రాలు వేసారు. వారు చేసిన ఆరోపణలపై పాలేరు ఎమ్మెల్యే ఉపేంద‌ర్‌రెడ్డి స్పందిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. దీపిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమ్మడి కంపెనీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు దాదాపు 11 రాష్ట్రాల్లో కొన్ని వేల కాంట్రాక్టులు చేసిందని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కాంట్రాక్టులను చేపట్టిందని గుర్తు చేశారు.

ఇప్పటి వరకు ఈ కంపెనీ చేసిన కాంట్రాక్టుల్లో ఎలాంటి చిన్న తప్పులూ జరగలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా, తాను ఆ పనులను చేపట్టినట్లుగా మాట్లాడ‌డం స‌రైంది కాద‌ని ఉపేంద‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. తమ కంపెనీకి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు పనులతో తనకు సంబంధం లేదని తేలితే కాంగ్రెస్ నాయకులు వారి పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.


Tags:    

Similar News