Harish Rao: గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది
Harish Rao: 1:100 చొప్పున పోస్టులు తీయాలని హరీశ్‌రావు డిమాండ్
Harish Rao: కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయానికి గ్రూప్స్ అభ్యర్థులు వచ్చి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున పోస్టులు తీయాలని అభ్యర్థులు కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున తీయాలని యువతను రెచ్చగొట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆ ప్రకారం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని... 11 వేలతో సరిపెట్టారని ఆక్షేపించారు.