Bhatti Vikramarka: ఎమ్మెల్యేల కొనుగోలుకు టీఆర్‌ఎస్ తెరలేపింది

Bhatti Vikramarka: షెడ్యూల్‌ 10లో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకొని.. టీఆర్‌ఎస్, బీజేపీలు నాటకాలాడుతున్నాయి

Update: 2022-10-27 12:45 GMT

Bhatti Vikramarka: ఎమ్మెల్యేల కొనుగోలుకు టీఆర్‌ఎస్ తెరలేపింది

Bhatti Vikramarka: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మొయినాబాద్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం కొత్త కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కూడా అంతే ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటోంది అంటూ ఆయన విమర్శించారు. కొత్తగా రెండు పార్టీలు డ్రామా లు అడుతున్నాయని, కొనుగోలు చేయడం బీజేపీ.. టీఆర్‌ఎస్‌కి కొత్త ఏం కాదని ఆయన అన్నారు. సర్పంచులు నుండి మొదలుకుని కొనుగోలు చేసింది టీఆర్‌ఎస్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.

నిన్నటి నుంచి డ్రామా రక్తి కట్టించే పనిలో పడ్డారని, కానీ ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను లాక్కుంటాం అని బీజేపీ మొదటి నుండి చెప్తుందని, మీ దగ్గరికి వచ్చే సరికే ఏదో జరిగి పోతుంది అని టీఆర్‌ఎస్‌ గగ్గోలు పెడుతుందన్నారు. బీజేపీ..టీఆర్‌ఎస్‌ వ్యవహారం నీచంగా ఉందని, పార్టీ ఫిరాయింపుల చట్టం లొసుగులను బీజేపీ.. టీఆర్‌ఎస్‌ వాడుకుంటుందని, కాగ్రెస్ అధికారంలోకి వస్తే 10 షెడ్యూల్ మార్చుతామన్నారు భట్టి.

Tags:    

Similar News