KTR: హైదరాబాద్ ప్రజల మీద సీఎం రేవంత్ పగబట్టారు
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
KTR: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మిగిలిపోతారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దాడులు చేస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు హైడ్రా పేరుతో హైడ్రామ చేస్తూ, ఎమ్మెల్యేల ఇంటికే గూండాలను పంపిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ బేధాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉంచినట్లు చెప్పారు. అందుకే హైదరాబాద్ ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. తమను గెలిపించలేదనే కక్షతోనే సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రజలపై కక్షకట్టారని అన్నారు కేటీఆర్.