Revanth Reddy: ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వరద ప్రాంతాలని పరిశీలించడానికి జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి స్వాగతం పలికారు. కూసుమంచి మండలం పాలేరు జలాశయం మినీ హైడల్ ప్రాజెక్ట్ వద్ద ఎడమ కాలువకు పడిన గండిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి,ఎంపీ రఘురామిరెడ్డి వరద ప్రాంతాలని పరిశీలించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని వరద బాధితులను పరామర్శించనున్నారు.