CM Revanth Reddy: అమెరికాకు సీఎం రేవంత్‌ టీమ్‌..

CM Revanth Reddy USA Tour: ఇవాళ్టి నుంచి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు.

Update: 2024-08-03 04:53 GMT

CM Revanth Reddy: అమెరికాకు సీఎం రేవంత్‌ టీమ్‌..

CM Revanth Reddy USA Tour: ఇవాళ్టి నుంచి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. 12 రోజుల పాటు ఆయన అమెరికా టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చే విధంగా ఈ పర్యటన కొనసాగనుంది. సీఎంతో అమెరికాలో మంత్రి శ్రీధర్‌బాబు కూడా పర్యటించనున్నారు. రెండురోజుల తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అమెరికాకు వెళ్లనున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్‌కో, దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది.

8 రోజుల పాటు అమెరికాలో.. రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం టీమ్‌ పర్యటించనుంది. ఈ పర్యటనలో కొన్ని ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ చుట్టూ నగరం విస్తరిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌కు ఈ బృందం తిరిగి చేరుకుంటుంది. 

Tags:    

Similar News