Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: రేపు పార్టీ హైకమాండ్‌తో రేవంత్ భేటీ
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టితో కలిసి.. హైకమాండ్‌తో భేటీ అవుతారు. పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పదవుల ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు సీఎం. అలాగే తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించబోయే కృతజ్ఞతా సభకు రాహుల్‌ను ఆహ్వానించనున్నారు. దీంతో పాటు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యంలో.. ఇందుకు సోనియా గాంధీని ఆహ్వానించునున్నట్టు తెలుస్తోంది.