CPI Narayana: సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలి
CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డి అయినా... విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి
CPI Narayana: సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయాణ డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటివరకూ చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోకి రాగానే విలీన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహిస్తామని చెప్పి.. MIM కి భయపడి ఇప్పటివరకూ చేయలేదన్నారు.
ఈసారి అయినా రేవంత్ రెడ్డి సర్కార్ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఎలాగో ఉంది వారికి కేంద్రం జాతీయ విపత్తుగా పేర్కొని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలన్నారు