Revanth Reddy: ఫిరాయింపు చట్టంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఫిరాయింపు చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది
Revanth Reddy: ఫిరాయింపు చట్టంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలన్న సీఎం రేవంత్.. ఎమ్మె్ల్యేలు పార్టీ మారకుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు. ఫిరాయింపులు మొదలుపెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు సీఎం రేవంత్. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పీఏసీ ఛైర్మన్ పదవిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపైనా మండిపడ్డారు సీఎం రేవంత్. 2019 నుంచి కాంగ్రెస్‌కు కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్‌కు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.