Revanth Reddy: ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్ టూరిజంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

Revanth Reddy: రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక స్థలాలపై దృష్టి సారించిన సర్కార్

Update: 2024-08-31 14:25 GMT

Revanth Reddy

Revanth Reddy: ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్ టూరిజంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్​సాగర్‌లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను పంపించింది. 25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియంను ఈ ప్రణాళికలో పొందుపరచనుంది.

Tags:    

Similar News