Revanth Reddy: చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆక్రమణలను ప్రభుత్వం ఉపేక్షించబోదు
Revanth Reddy: చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్.. చెరువుల కబ్జాల కారణంగానే వరదలు వస్తున్నాయన్నారు. ఇకపై ఆక్రమణలను ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను చెరువుల్లో కబ్జాలపై లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు సీఎం రేవంత్.