Revanth Reddy: గోపన్‌పల్లిలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy: హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం

Update: 2024-07-20 14:01 GMT

Revanth Reddy: గోపన్‌పల్లిలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ 

Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5ఏళ్లలో లక్షా 50వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. గోపన్‌పల్లిలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రులు వెంకట్‌రెడ్డి, పొంగులేటి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం అన్నారు. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News