నేడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: కొత్త సమీకృత కలెక్టరేట్, ఎస్పీ భవనాల ప్రారంభం

Update: 2023-06-30 02:35 GMT

నేడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఆసిఫాబాద్ వేదికగా పోడు భూములు సాగు చేసుకుంటున్న 12 మంది రైతులకు ఆసిఫాబాద్‌లో పోడు పట్టాలను అందించనున్నారు సీఎం. ఆ తర్వాత జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 50 వేల మంది పోడు రైతులు.. 4 లక్షల 5 వేల ఎకరాలను సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్త సమీకృత కలెక్టరేట్, ఎస్పీ భవనాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నూతన బీఆర్ఎస్‌ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు సీఎం. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ప్రగతిభవన్‌ నుంచి 10 గంటల 50 నిమిషాలకు సీఎం కేసీఆర్ బేగంపేట బయలుదేరనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఆసిఫాబాద్‌ పట్టణానికి చేరుకుంటున్నారు. ముందుగా కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించి.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తారు. అనంతరం మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత జిల్లా ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలు ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తారు.

Tags:    

Similar News