CM KCR: నేడు దత్తత గ్రామంలో కేసీఆర్ పర్యటన

CM KCR: నేడు సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాల మర్రిలో పర్యటించనున్నారు.

Update: 2021-06-22 01:54 GMT

CM KCR:(File Image)  

CM KCR: సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రిలో నేడు పర్యటించనున్నారు. అంతే కాకుండా వాసాలమర్రిలో గ్రామస్తులందరికీ ఏర్పాటు చేసిన భోజనాల కార్యక్రమంతోపాటు, బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. గత రెండు రోజులుగా సీఎం జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో కేసీఆర్ పర్యటకు సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తోపాటు, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నిన్న వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి, భోజనశాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ స్వయంగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులుకు ఫోన్‌లో చేసిన సూచనల మేరకు ఏర్పాట్లు చేయడంలో మూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గ్రామ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కార్యాచరణ ఉండేందుకు గాను సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ఇతర గ్రామాల వారు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.

సహపంక్తి భోజనాలు ఒకచోట, సభ మరోచోట నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అధికారులు పాసులు అందజేశారు. ఇలా ఉండగా, వాసాలమర్రి గ్రామంలోని 2,600 మంది నివాసితులతో సీఎం కేసీఆర్ కమ్యూనిటీ లంచ్‌లో పాల్గొన్న అనంతరం గ్రామంలో వివిధ అభివృద్ధి పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News