CM KCR: ఇవాళ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: ఉ.11 గంటలకు హాలియా చేరుకోనున్న సీఎం * హాలియా మార్కెట్‌యార్డులో ప్రజాప్రతినిధులతో సమీక్ష

Update: 2021-08-02 03:22 GMT

నాగార్జున సాగర్ లో సీఎం కెసిఆర్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్‌ నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.. ఉదయం 11 గంటలకు హాలియా చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీఆర్ఎస్ నాయకులు.

హాలియా చేరుకున్న తర్వాత అక్కడి మార్కెట్ యార్డులో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. సాగర్‌ ఉప ఎన్నిక సమయంలో నియోజకవర్గ ప్రజలకు హామీల వర్షం గుప్పించారు. తమ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపిస్తే పదిహేను రోజుల్లో తానే స్వయంగా వచ్చి అభివృద్ధికి నిధులు విడుదల చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులతో చర్చించి నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షకు దాదాపు మూడు వేల మంది పాల్గొనున్నారు.

హాలియాలో సమీక్ష అనంతరం సీఎం ఎమ్మెల్యే నోముల భగత్‌ ఇంటికి వెళ్తారు. ఎమ్మెల్యే ఇంట్లో భోజనం చేశాక.. హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. అయితే సీఎం కేసీఆర్ టూర్‌ను అడ్డుకుంటామని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లే రెండున్నర కిలోమీటర్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ నేపథ్యంలో హాలియా మీదుగా వెళ్లే వాహనాలను మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హాలియా నుంచి మాచర్ల, సాగర్ వైపు వెళ్లే వాహనాల్ని మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా మళ్లిస్తున్నారు.

Full View


Tags:    

Similar News