గ్రేటర్ ఎన్నికలపై అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో నిర్వహిస్తోన్న ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. దీంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలు, పంట నష్టం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రులతో సమావేశం ముగిశాక పార్టీ జనరల్ సెక్రటరీలతో భేటీ అవనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం అవనున్నారు.
అటు గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పరిస్థితులపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ ఐదుగురు ఎమ్మెల్యేలతో సమీక్ష జరుపుతున్న కేటీఆర్ డివిజన్ల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించటంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.