CM KCR: మనం ఉన్నప్పుడు చేసిన పనులే.. లక్షల కోట్ల సంతృప్తి

CM KCR: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పని చేసినా మానవీయకోణం ఉంటుంది

Update: 2022-12-04 10:55 GMT

CM KCR: మనం ఉన్నప్పుడు చేసిన పనులే.. లక్షల కోట్ల సంతృప్తి

CM KCR: తెలంగాణ ఉద్యమ సమయం నుంచే పాలమూరు జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ కిట్‌ ఆలోచన వెనుక ఎంతో పరమార్థం ఉందన్నారు.. చాలా ఆలోచించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మానవీయ కోణంలో ఈ కిట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కలిగినవారి కుటుంబంలో శ్రీమంతం వంటి వేడుకలు జరుగుతాయి... పేద బిడ్డలు తినడానికే కష్టంగా ఉంటుందని అన్నారు. పౌష్టిక ఆహారం అందక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే గర్భిణీ మహిళలు పని చేయకుండా... విశ్రాంతి తీసుకోవాలనే కేసీఆర్‌ కిట్‌ తెచ్చామన్నారు. పేద మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకే ప్రభుత్వ సంక్షేమ పథకాలని కేసీఆర్ వివరించారు.

 వేదనలు రోదనతో ఇబ్బంది పడిన పాలమూరు జిల్లా నేడు ఆనందంగా ఉంది.. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉందని గులాబీ బాస్‌ స్పష్టం చేశారు. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు పెడుతున్నామన్నారు. అదే స్ఫూర్తితో గురుకులాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాకా ఏడేళ్ల క్రితం తెలంగాణలో దారుణమైన కరెంట్‌ కష్టాలు ఉండేవి.... ఇప్పుడు ఆ సమస్య లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్ చేరుకున్న కేసీఆర్‌... శివారులో నిర్మించిన.. జిల్లా సమీకృత పరిపాలనా భవనం కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత టీఆర్ఎస్‌ జిల్లా పార్టీ ఆఫీస్‌ను ప్రాంభించి.... టీఆర్‌ఎస్‌ జెండాను ఎగువ వేశారు. కొత్త కార్యాలయాల్లో పూజలు నిర్వహించి... స్థానిక నేతలతో కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పాలమూరు కొత్త శోభను సంతరించుకుంది. గులాబీ తోరణాలు, పెక్సీలులతో కళకళలాడింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన జాతీయ రహదారి ఎటుచూసినా గులాబీ మయంగా కనిపించింది.

Tags:    

Similar News