Telangana: మెట్రో రైల్ సర్వీస్ ను ఆదుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం

* ఎల్ అండ్ టీ అధికారులకు కేసీఆర్ హామీ * నష్టాలను అధిగమించి గాడిలో పడేలా చేస్తామని భరోసా

Update: 2021-09-15 02:06 GMT

మెట్రో సర్వీస్‌ (ట్విట్టర్ ఫోటో)

Telangana: మెట్రోను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. నష్టాల నుంచి గట్టెక్కించడానికి చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీస్‌ సూపర్‌. ట్రాఫిక్‌ చింతా లేకుండా సేఫ్‌గా హాయిగా జర్నీ చేయవచ్చు. వేగంగా గమ్యానికి తీసుకువెళ్లే మెట్రో ఆర్థిక కష్టాల్లో కురుకపోయింది. అప్పులు పెరిగిపోతున్నాయి. వడ్డీలు కట్టలేని పరిస్థితి దాపరించింది. దీంతో మెట్రో అధికారులు, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ పరిస్థితిని మొర పెట్టుకున్నారు.

కరోనా పరిస్థితులు మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రోను ఆదుకోవాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎటువంటి విధానాలు అవలంభిస్తే మెట్రోకు మేలు జరుగుతుందో పరిశీలిస్తామన్నారు. మెట్రోకు పూర్వవైభవం తీసుకురావాడానికి అత్యున్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఎయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్  కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని వెల్లడించారు.

Tags:    

Similar News