Telangana: అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం: సీఎం కేసీఆర్
Telangana: పెద్దపల్లి అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబందం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Telangana: పెద్దపల్లి అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబందం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అడ్వకేట్ దంపతులను హత్యచేయడం దారుణం అన్న కేసీఆర్.. హత్యకేసులో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉన్నాడని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి ఈ హత్య కేసులో ఎవరున్నా వదిలిపెట్టమన్నారు.