ఆలుగడ్డ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్

Update: 2021-01-03 05:34 GMT

సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రంజోల్‌ గ్రామానికి చెందిన ఆలుగడ్డ రైతు నాగేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ముచ్చటించారు. ఆలుగడ్డ సాగు విధానంపై ఆరా తీశారు. ఆలుగడ్డ సాగు అక్కరకొస్తుందా? ఏ భూములకు ఏ పంట అనుకూలం? అంటూ ప్రశ్నలు వేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలో ఈ ఏడాది సుమారు 2వేల ఎకరాల్లో ఆలుగడ్డ పంటను వేశారని నాగేశ్వర్‌రెడ్డి సీఎంకు వివరించారు. ఎర్రనేలల్లో వేసిన పంటకు అంతగా డిమాండ్‌ ఉండదని వివరించారు. జహీరాబాద్‌ ప్రాంత భూములకు 166 పోక్రాజ్‌ అనుకూలమైందని, ఒక చెట్టుకు 8నుంచి 10గడ్డల వరకు దిగుబడి ఉంటుందన్నారు. ఎకరాకు 16బస్తాల ఆలుగడ్డను పొలంలో వేస్తే 85 రోజుల తర్వాత 15 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, మార్కెట్లో కిలో ఆలుగడ్డ ధర ప్రస్తుతం రూ.17 నుంచి రూ.20 వరకు ఉంటుందని, ఆలుగడ్డలో జ్యోతి, ఖ్యాతి తదితర రకాలున్నా అంతగా దిగుబడి ఉండదని చెప్పారు. గతంలో తాను సీఎంతో అల్లం సాగుపై చర్చించినట్టు నాగేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు.

Full View


Tags:    

Similar News