CM KCR: మేథా గ్రూప్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
CM KCR: రూ.1000 కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని నిర్మించిన మేధా గ్రూప్
CM KCR: రంగారెడ్డి జిల్లా కొండల్ వద్ద నిర్మించిన మేథా గ్రూప్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీని వేయి కోట్లతో మేధా గ్రూప్ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల 200 మందికి ఉపాధి లభిస్తోందని మేథా గ్రూప్ తెలిపింది.
చాలా రాష్ట్రాల్లో సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులిచ్చే పద్దతి ఉందని... కాని టీఎస్ ఐపాస్ మాత్రం రియల్ సింగిల్ విండో సిస్టమ్ అన్నారు సీఎం కేసీఆర్. టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఫాల్స్,బోగస్ MOUలు కుదుర్చుకోవడం లేదని చెప్పారు. 15 రోజుల్లోనే అనుమతులు లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇలాంటి చర్యల వల్ల పారిశ్రామిక ప్రగతి పెరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.