Command Control Centre: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Police Integrated Command Control Center: తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు.

Update: 2022-08-04 09:07 GMT

Command Control Centre: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Police Integrated Command Control Center: తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం.. పోలీసు విభాగానికి మూడో నిఘా నేత్రంగా పనిచేయనుంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు లక్ష కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్‌ కేంద్రంలో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా సిబ్బంది పని చేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News