CM KCR: నియోజకవర్గాల అభివృద్ధిపై కేసీఆర్ ఫోకస్
CM KCR: అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్, పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అని ఆరా
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టిసారించారా..? నియోజకవర్గాల అభివృద్ధి పై ఎప్పటి కప్పుడూ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారా..? గ్రామస్థాయి లో అమలు అవుతున్న పథకాల పై ప్రజలు ఏమి అనుకుంటున్నారు..? ఈ అంశాల పై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారా?
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారట. ఇప్పటికే సర్వే ఏజెన్సీల ద్వారా రాష్ట్ర ప్రజలు పథకాలపై ఏమనుకుంటున్నారు. పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలు ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇంకా ఎలాంటి పథకాలను అందించాలని దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో లో చెప్పక పోయిన చాలా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే గిరిజనుల కోసం గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. దళిత బంధు లాగానే గిరిజన బంధు అమలు చేయడంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.
దళిత బంధులో దళితుల కోసం పలు రకాల వస్తువులు అందిస్తున్న నేపథ్యంలో గిరిజన బంధులో ఎలాంటివి అందించాలని దానిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సాధించారు. గిరిజన అందుకు సంబంధించిన మార్గదర్శకాలు తొందర్లోనే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇక వారం వ్యవధి లో గిరిజన బంధుకు సంబంధించిన జీవో విడుదల చేసిన అనంతరం అమలు తేదీని ప్రకటించనుంది ప్రభుత్వం. ఇదేవిధంగా వివిధ కులాల వారీగా కూడా బంధును ప్రకటించి ఆదుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి పధకాలను ప్రకటిస్తుందో వేచి చూడాలి.