పద్మ శ్రీ తిమ్మక్కకు సీఎం కేసీఆర్ సన్మానం
Pragathi Bhavan: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క...
Pragathi Bhavan: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి సీఎం స్వయంగా తోడ్కొని వెళ్లి పద్మశ్రీ తిమ్మక్క గారిని, సమావేశంలో పాల్గొన్న మంత్రులకు పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం కేసీఆర్ ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పద్మశ్రీ తిమ్మక్క అన్నారు. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క గారు సీఎంకు తెలుపడం, పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క గారు పడుతున్న తపన, సమావేశంలో పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపింది.
ఈ సందర్భంగా పర్యావరణ కృషికై రచయితలు రాసిన ఆకపచ్చ వీలునామా పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కకు సీఎం కేసిఆర్ అందజేశారు.