Etela Rajender Issue: ఈటలపై విచారణకు సీఎం ఆదేశం

Etela Rajender Issue: మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.

Update: 2021-04-30 16:24 GMT

సీఎం కేసీఆర్, ఇన్‌సెట్‌లో ఈటల (ఫొటో దిహన్స్ ఇండియా)

Etela Rajender Issue: మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ ను సీఎం ఆదేశించారు. అలాగే ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణలను తేల్చాలని విజిలెన్స్ డీజీ పూర్ణచందర్‌ రావును సీఎం ఆదేశించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూముల కబ్జా వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు.

వివరాల్లోకి వెళ్తే...తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని, గ్రామస్థులను బెదిరించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల, ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్ రెడ్డి గ్రామస్థులను బెరిరించారని ఫిర్యాదు చేశారు. వారి చెర నుంచి భూములను విడిపించి వాటిపై శాశ్వత హక్కులను కల్పించాలని సీఎంని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు ప్రతిని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, మెదక్‌ జిల్లా కలెక్టర్ హరీశ్‌లకు కూడా పంపించారు.

Tags:    

Similar News