Telangana: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని కుమార్తె
Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి.
Telangana:తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. ఎన్నికల్లో పొటీ ఇచ్చే అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నుంచి ఊహించని అభ్యర్థిని బరిలోకి దింపనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు కేసీఆర్. ఈ మేరకు ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గతకొంత కాలంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజుకో పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ఆదివారం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి రామచంద్రారెడ్డి (బీజేపీ), మాజీమంత్రి చిన్నారెడ్డి (కాంగ్రెస్),ఫ్రొపెసర్ నాగేశ్వర్ ప్రధానంగా పోటీలో ఉన్నారు.
గ్రాడ్యూయేట్ శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను సీఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుండగా.. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.