2020-21 రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష!

2020-21 రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష నిర్వహించారు. దేశ జీడీపీ మైనస్ 24శాతానికి పడిపోవడం ఆ ప్రభావం రాష్ట్రాలపై కూడా పడుతోందన్నారు.

Update: 2020-10-23 15:19 GMT

2020-21 రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష నిర్వహించారు. దేశ జీడీపీ మైనస్ 24శాతానికి పడిపోవడం ఆ ప్రభావం రాష్ట్రాలపై కూడా పడుతోందన్నారు. మరోవైపు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడిందని, దాంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇక, వరదలతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సీఎం కేసీఆర్‌..... బాధితులందరికీ దసరా పండగలోపే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా ఉందన్న కేసీఆర్.. 1850 రూపాయల మద్దతు ధరతో మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోలుకు హామీ ఇచ్చారు. అలాగే, వరి ధాన్యం సేకరణకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌‌ను ఈనెల 29న మధ్యాహ్నం పన్నెండున్నరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

మద్దతు ధర వచ్చే పరిస్థితులు లేనందునే వానాకాలం మొక్కజొన్న వేయొద్దని రైతులను కోరినట్లు సీఎం తెలియజేశారు. అయితే ప్రభుత్వం వద్దని చెప్పినా.... రైతులు మొక్కొజన్న సాగు చేశారన్నారు. అందుకే, రైతులు నష్టపోవద్దని మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు సీఎం. మొక్కజొన్నకు 1850 రూపాయల మద్దతు ధర చెల్లించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా వరి ధాన్యం సేకరణకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, కొన్ని జిల్లాల్లో పసుపుకు అంతరపంటగా మొక్కజొన్న వేయాలని సూచించినట్లు వివరించారు.

Tags:    

Similar News