CM KCR: వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
CM KCR: వర్షాల నేపథ్యంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి
CM KCR: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. కలెక్టర్లు, సంబంధితశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులను, ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్‌లను అప్రమత్తం చేయాలన్నారు. అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ నేపథ్యంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇరిగేషన్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో 11న జరగాల్సిన రెవెన్యూ సదస్సులు వాయిదా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీలు ప్రకటిస్తామన్నారు సీఎం కేసీఆర్.