Fake Passport Scam: పాస్‌పోర్టుల స్కామ్‌లో ముగిసిన నిందితుల సీఐడీ కస్టడీ
Fake Passport Scam: పాస్‌పోర్టుల స్కామ్‌లో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల హస్తంపై ఆరా
Fake Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం కేసులో నిందితుల సీఐడీ కస్టడీ ముగిసింది. 12 మంది నిందితులను ఐదు రోజుల పాటు సీఐడీ విచారించింది. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుర్తించారు. శ్రీలంక దేశస్తులు ఎక్కువ మంది అడ్డదారిలో పాస్‌పోర్ట్ పొందినట్లు నిర్ధారణకు వచ్చారు.
విదేశాలకు వెళ్లిపోయిన వారి వివరాలను సీఐడీ సేకరిస్తుంది. పాస్‌పోర్ట్‌లు ఇప్పించడంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పాస్‌పోర్ట్ రద్దు కోరుతూ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి సీఐడీ లేఖ రాసింది. దేశంలోని అన్నీ విమానాశ్రయాలను అలర్ట్ చేస్తూ లుకౌట్ నోటీసులు జారీ చేశారు.