గిరిజన దేవతలను కించపర్చలేదని చిన్నజీయర్ స్వామి క్లారిటీ
Chinna Jeeyar Swami: ఆదివాసీలను, మహిళలను తాను ఎప్పుడు కించపర్చలేదని చిన్నజీయర్ స్వామి క్లారిటీ ఇచ్చారు.
Chinna Jeeyar Swami: ఆదివాసీలను, మహిళలను తాను ఎప్పుడు కించపర్చలేదని చిన్నజీయర్ స్వామి క్లారిటీ ఇచ్చారు. గిరిజన దేవతలను చిన్నచూపు చూసేలా తాను కామెంట్ చేయలేదన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన గుర్తుచేశారు. ఎప్పుడో 20 ఏళ్ల కింద అన్న మాటలను ఎవరో వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని చిన్నజీయర్ అన్నారు.
సమాజాన్ని ప్రభావితం చేసే దేవతలను మేం విమర్శించే ప్రశ్నే ఉండదన్నారు. కొందరు పనిగట్టుకొని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆస్తికులు, నాస్తికులు తనకు మిత్రులే అని చెప్పారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఎంట్రీ ఫీజు తప్పా పూజలకు, ప్రసాదాలకు డబ్బులు వసూలు చేయడం లేదన్నారు.