జూన్ 8న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తెరవడం లేదు: ప్రధాన అర్చకులు

మొన్నటి వరకు అంటే లాక్ డౌన్ 4.0 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎంతో కఠినంగా అమలు చేసారు.

Update: 2020-06-01 12:31 GMT

మొన్నటి వరకు అంటే లాక్ డౌన్ 4.0 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎంతో కఠినంగా అమలు చేసారు.కరోనా లేని జిల్లాల్లో దశల వారీగా కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ 5.0లో మరికొన్నింటికి సడలింపులు ఇచ్చారు. దీంతో జూన్ 8 నుంచి దేశంలోని ప్రధాన ఆలయాలను తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ వీసా దేవునిలా ఎంతో ప్రఖ్యాతి గాంచిన బాలాజి దేవాలయం మాత్రం జూన్ 8 నుంచి తెరవడం లేదు. ఈ విషయంపై ఇంకా స్పష్టతకు రాలేదని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. గుడని ఎప్పుడు తెరవాలి అనే విషయాన్ని సమీక్ష జరిపి ఆ తరువాత నిర్ణయం తీసకుని ఆలయం తెరిచే తేదీలను మీడియా ముఖంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.

నగరశివార్లలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చిలుకూరు బాలాజి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో బాలాజీని వీసాల దేవుడిగా భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఎవరైనా కోరికలు కోరుకుని 11 ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం. ముఖ్యంగా విదేశాలకు వెల్లాలనుకునే వారికి వీసాలు ఖచ్చితంగా వస్తాయని నమ్ముతుంటారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఈ ఆలయంపైన కూడా పడడంతో మార్చి 19 నుంచి చిలుకూరు ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు. ముందుగా ఆలయాన్ని మార్చి 25 వరకే మూసివేస్తామని తరువాత తెరుస్తామని ప్రకటించినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా భక్తుల ప్రవేశం నిషేధాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. ఆలయంలో భక్తులను అనుమతించనప్పటికీ ఆలయంలో అర్చకులు ఎప్పటిలాగే పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం మే 30వ తేదీన లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా జూన్ 8 నుంచి రెస్టారెంట్లు, ఆతిథ్య రంగ సేవలు, మాల్స్, ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News