ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
* ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశం * సీఎస్ సోమేష్‌కుమార్‌తో చర్చించిన సీఎం కేసీఆర్ * ఉదయం 10గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నిన్న సీఎస్ సోమేష్‌కుమార్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పీఆర్సీపై చర్చించారు. ఉద్యోగ సంఘాలతో ఇవాళ లంచ్ మీటింగ్ నిర్వహించనున్న కేసీఆర్ ఉద్యోగుల సమక్షంలోనే పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇయర్ ఎండింగ్‌లో ఉద్యోగులకు తీపి కబురు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఈ మీటింగ్ మరింత ప్రాధన్యత సంతరించుకుంది.
దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు కేసీఆర్‌తో భేటీ కానున్నారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి ఉద్యోగులతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలను సీఎం అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి చివరి కల్లా ఉద్యోగుల సమస్యలను పరిష్కారమవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులతో సమావేశానికి ప్రాధన్యత పెరిగింది.