Chest Hospital Hyderabad: చెస్ట్ ఆసుపత్రిలో కలవరపెడుతున్న వరుస మరణాలు

Chest Hospital Hyderabad: చెస్ట్ హస్పిటల్ లో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి.

Update: 2020-07-02 12:00 GMT

Chest Hospital Hyderabad: చెస్ట్ హస్పిటల్ లో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మూడు రోజుల క్రితం వరుసగా వచ్చిన సెల్ఫీ వీడియోలు రోగుల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. వెంటిలేటర్లు పెట్టడం లేదు. చికిత్స సరిగ్గా లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.

నాలుగు రోజుల క్రితం జవహర్ నగర్ కు చెందిన రవికుమార్ తనకి వెంటిలేటర్ తొలగించారని, శ్వాస రావడం లేదంటూ సెల్ఫీ వీడియో తీసి, చనిపోయాడు. మరుసటి రోజు రెహమత్ నగర్ కు చెందిన సయ్యద్ తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తర్వాత కొద్ది సేపటికే సయ్యద్ చనిపోయాడు.

ప్రస్తుతం అధిక లక్షణాలున్న కేసులే చెస్ట్ ఆస్పత్రికి వస్తున్నాయని సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ తెలిపారు. వరుస మరణాల సంఘటనలో వైద్యుల తప్పిదం లేదని వాళ్ల హార్ట్ కి వైరస్ సోకడం, ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడం వల్లే మరణాలు సంభవించాయని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దవాఖానలన్నీ పూర్తిగా రోగులతో నిండిపోయాయి. దీనికి తోడు సిబ్బంది కొరత ఏర్పడింది. పైగా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.


Tags:    

Similar News