చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..

CI Srinivas Reddy: సిద్ధిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాస్‌ను సీపీ శ్వేత సస్పెండ్ చేశారు.

Update: 2023-02-06 06:23 GMT

చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..

CI Srinivas Reddy: సిద్ధిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాస్‌ను సీపీ శ్వేత సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు చేస్తూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్య జరిగిన రోజు సీఐ శ్రీనివాస్ అందుబాటులో లేడు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్‌లో సీఐ రాక కోసం స్థానిక ఎమ్మెల్యే వేచి చూశారు. సీఐ అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారులు మోమో జారీ చేశారు. అయినా తీరు మార్చుకోకుండా..అనుమతి లేకుండా పొరుగు ప్రాంతానికి వెళ్లడంతో, సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చేర్యాల సీఐ గా బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే సీఐ శ్రీనివాస్ సస్పెండ్ కు గురయ్యారు.

Tags:    

Similar News