Cheapest Corona Drug Favipiravir: తక్కువ రేటుకే ఫావిపిరావిర్ ట్యాబెట్స్
Cheapest Corona Drug Favipiravir: ప్రస్తుతం కరోనా చికిత్సలో వాడుతున్న ఫావిపిరావిర్ మందును హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్ గ్రూప్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను తయారు చేసింది
Cheapest Corona Drug Favipiravir: ప్రస్తుతం కరోనా చికిత్సలో వాడుతున్న ఫావిపిరావిర్ మందును హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్ గ్రూప్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అందిస్తుంది. ఈ టాబ్లెట్ ధరను రూ.33 లుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్‌ను సొంత పరిశోధన ద్వారా టాబ్లెట్ ను తయారు చేశామన్నారు. నాణ్యమైన మందులు అందరికీ తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామన్నారు.
ఇక ఇప్పటికే ఎంఎస్‌ఎన్ గ్రూప్ కోవిడ్-19 చికిత్సలో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ ను ప్రవేశపెట్టింది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం కంపెనీకి ఉందన్నారు. ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం బొలారం ప్లాంటులో దీనిని తయారు చేస్తున్నామని, డిమాండ్ అధికమైతే కొత్తూరు యూనిట్లో కూడా ఉత్పత్తి చేస్తామని వివరించారు. 2003లో ప్రారంభమైన ఎంఎస్‌ఎన్ గ్రూప్‌నకు తెలంగాణలో 11 ఏపీఐ, మూడు ఫార్ములేషన్ యూనిట్లున్నాయి.